Stock Market: నష్టాలతోనే కొనసాగుతున్న స్టాక్ మార్కెట్.! 1 y ago
19-02: అస్థిర ట్రేడింగ్ సెషన్లో ఫిబ్రవరి 19న భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టంతో ముగిశాయి. సెన్సెక్స్ 28.21 పాయింట్లు (0.04%) తగ్గి 75,939.18 వద్ద, నిఫ్టీ 12.40 పాయింట్లు (0.05%) తగ్గి 22,932.90 వద్ద ముగిసాయి. 2724 షేర్లు లాభపడగా, 1079 నష్టపోయాయి. డాక్టర్ రెడ్డీస్, TCS, HUL, ఇన్ఫోసిస్, అదానీ ఎంటర్ప్రైజెస్ వంటి షేర్లు నష్టాలను చవిచూశాయి, కానీ భారత్ ఎలక్ట్రానిక్స్, హిందాల్కో, L&T, యాక్సిస్ బ్యాంక్ లాంటి షేర్లు లాభపడ్డాయి. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో మంచి రికవరీ కనిపించింది. మార్కెట్ హెచ్చుతగ్గులతో ట్రేడ్ అయింది.